ఓటీటీలోకి అల్లు శిరీష్‌ ‘బడ్డీ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

-

అల్లు శిరీష్‌ కథానాయకుడిగా నటించిన సరికొత్త చిత్రం ‘బడ్డీ’ ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. శామ్‌ ఆంటోన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గాయ‌త్రీ భ‌ర‌ద్వాజ్‌ కథానాయిక. అజ్మల్‌, ప్రిషా రాజేశ్‌ సింగ్‌ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా ఆగస్టు తొలివారంలో థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఆగస్టు 30 నుంచి ఇది అందుబాటులో ఉండనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది.

ఇది త‌మిళంలో వ‌చ్చిన టెడ్డీకి రీమేక్‌. ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌ను తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లుగా కాస్త మార్పులు చేశాడు. అవ‌య‌వాల అక్ర‌మ ర‌వాణా ముఠా నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. ఈ ముఠా అరాచ‌కాల్ని ఒక టెడ్డీ బేర్‌తో క‌లిసి హీరో శిరీష్ ఎలా అడ్డుకున్నాడ‌న్న‌ది ఈ సినిమా కథ. ఈ మూవీలో టెడ్డీ-హీరోల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని టాక్.

Read more RELATED
Recommended to you

Latest news