అధికారిక చిహ్నం మార్పు…కాకతీయ తోరణం, చార్మినార్ లతో ఈ వెకిలి పనులు ఏంటి ?

-

తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్ లతో ఈ వెకిలి పనులు ఏంటి ? అంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌ పై కేటీఆర్‌ సీరియస్‌ అయ్యారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేకుండా రాజముద్ర కూడా రేవంత్‌ రెడ్డి సర్కార్‌ వదిలినట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే.. ఈ అంశంపై కేటీఆర్‌ స్పందించారు. ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా? అసలు ఎం జరుగుతోందో కనీసం మీకైనా తెలుసా Telangana CS గారు? అంటూ నిలదీశారు కేటీఆర్‌.

KTR Reacts On Telangana official symbol change

తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్ లతో ఈ వెకిలి పనులు ఏంటి ? అని నిప్పులు చెరిగారు. కాక‌తీయ కళా‌తో‌రణం, చార్మినార్‌ లేని రాజ‌ము‌ద్రతో గ్రేటర్‌ వరం‌గల్‌ కార్పొ‌రే‌షన్‌ ప్రధాన కార్యా‌లయం ఎదుట అధి‌కా‌రులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది అంటూ కౌంటర్‌ ఇచ్చారు. ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు? అని నిలదీశారు. ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు? దీనికి కారకులెవరో కనుక్కుని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news