AP E-Cabinet: ఇవాళ ఈ-కేబినెట్.. అంతా ఆన్‌లైన్ లోనే..చంద్రబాబు సంచలనం !

-

 

ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది.పేపర్ లెస్ విధానాన్ని అవలంభిస్తూ ఈ-కెబినెట్ నిర్వహిస్తున్న ప్రభుత్వం….2014-19 మధ్య కాలంలో నిర్వహించిన ఈ-కెబినెట్ విధానాన్ని.. మళ్లీ అమల్లో పెట్టింది. ఈ కెబినెట్ భేటీలో కీలకాంశాలపై చర్చ జరుగనుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేయనున్న కెబినెట్….గతంలో అమల్లో ఉన్న సాంప్రదాయ టెండరింగ్ పద్ధతిని పునరుద్ధరణకు ఆమోదించనుంది. సాగునీటి సంఘాల ఎన్నికలకు కెబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.

పోలవరం ఎడమ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6000 క్యూసెక్కుల పెంచుతూ గతంలో ఇచ్చిన టెండర్ నిబంధనలకు అనుగుణంగా పనులకు అనుమతి ఇవ్వనుంది. రూ. 1226.68 కోట్ల పాత కాంట్రాక్టర్లకే పనులు కొనసాగిస్తూ అనుమతించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సెబ్ రద్దుపై మంత్రివర్గంలో చర్చించి.. నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఎక్సైజ్ కొత్త పాలసీ, ప్రొక్యూర్మెంట్ పాలసీలపై కెబినెట్లో చర్చించనున్నారు మంత్రులు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణపై కెబినెట్లో చర్చ ఉంటుంది. రేషన్ బియ్యం సరఫరా చేసే ఎండీయూ వాహానాలను రద్దు చేసే అంశంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఏపీ విజన్ డాక్యుమెంట్-2047పై మంత్రివర్గంలో చర్చ ఉంటుందని సమాచారం. కొన్ని శాఖల బదిలీల గైడ్లైన్స్ మార్పులు చేర్పులు పైన క్యాబినెట్లో చర్చ జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news