Viral : క్యాబ్ డ్రైవర్ ను ఎత్తుకొని నేలపై పడేసిన వ్యక్తి..!

-

ఓలా డ్రైవర్  పై దాడి చేసినందుకు మహారాష్ట్రలోని ఘట్ కోపర్ లో రిషబ్ బిభాస్ చక్రవర్తి, అతని భార్య అంతరా ఘోష్ లపై ముంబయి పార్క్ సైట్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటన కి సంబంధించిన సీసీ టీవీ పుటేజ్ కూడా బయటికీ వచ్చింది. ఆడిలో ప్రయాణిస్తున్న బిభాస్ క్యాబ్ ఆడిని కొద్దిగా తాకినప్పుడు క్యాబ్ డ్రైవర్ తో ఎలా అనుచితంగా ప్రవర్తించాడో ఇందులో వీక్షించవచ్చు.

ఈ ఘటన తరువాత క్యాబ్ డ్రైవర్ ఖురేషి జేేజే ఆసుపత్రిలో చేర్చారు. స్పృహ లోకి వచ్చిన పోలీసులు అతని వాంగ్మూలాన్ని నమోదు చేసి ఈ వ్యవహారం పై కేసు నమోదు చేసారు. సీసీటీవీ పుటేజిలో, చక్రవర్తి డ్రైవర్ ఖయూముద్దిన్ ఖురేషిని ఎత్తుకొని నేలపై పడేయడం చూడవచ్చు. తెల్లని రంగు ఆడి ముందుకు కదులుతున్నట్టు వీక్షించవచ్చు. దాని వెనుక గ్రాండ్ మమ్ గ్రే కలర్ ఎర్టిగా ఉంది క్యాబ్. ఇంతలోనే ఆడి రైడర్ ఒక్కసారిగా బ్రేకులు కొట్టాడు. దీంతో క్యాబ్ ను ఆడి కొద్దిగా తాకింది. ఆడిలో ప్రయాణిస్తున్ బిభాష్ తన కారు నుంచి దిగి.. డ్రైవర్ చెప్పుతో కొట్టాడు. ఇక ఆ తరువాత క్యాబ్ డ్రైవర్ ని ఎత్తుకొని నేలపై పడేశాడు. క్యాబ్ డ్రైవర్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం  ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.  

Read more RELATED
Recommended to you

Latest news