అమెరికా చిలక..పోలీసులకే షాక్ ఇచ్చిందిగా…!!!

-

సాధారణంగా, ఎవరైనా మన కళ్ళ ముందు బాధ పడుతున్నా, కష్టాలు పడుతున్నా, చూసి తట్టుకోలేని వాళ్ళు మనలో చాల మంది ఉంటారు. ఏదోరకంగా వాళ్ళకి సాయం చేయాలి అనుకుంటారు. ఒక్కోసారి కళ్ళతో చూడకుండానే మాటల ద్వార వారి బాధని అంచనా వేసి సాయం చేస్తుంటారు. సాయపడటం మంచి విషయమే కానీ మొత్తం కథ తెలియకుండా మాత్రం చేయకూడదు అనేలా చేసింది అమెరికాలోని ఈ కథ….అసలు కథ ఏంటంటే..

అమెరికాలో ఫ్లోరిడాలో నివాసం ఉంటున్న ఒక మహిళకి, ఆమె ఇంటి పక్కన ఇంట్లోంచి రెండు రోజులుగా  ఒక అమ్మాయి ఏడుపులు వినిపించటంతోపాటు, గట్టిగా హెల్ప్ హెల్ప్ అంటూ అరుపులు కూడా వినిపించాయట. దానితో ఆ మహిళా కంగారు పడి, ఎవరో అమ్మాయికి ఏదో అవుతోంది అని బయపడి పోలీసులకి ఫిర్యాదు చేసింది. హుటాహుటిన పోలీసులు కేకలు వినిపిస్తున్న ఇంటికి  చేరుకున్నారు, అదే సమయానికి ఆ ఇంటి యజమాని తన కార్ రిపేర్ చేసుకుంటూ కనిపించాడు.

 

పోలీసులు యజమానిని నిలదీయగా, అలాంటిదేం లేదంటూ బదులిచ్చాడు. తమకి ఫిర్యాదు వచ్చిన విషయం చెప్పి లోపలి చూడాలని పట్టుపట్టారు. ఇక తప్పక ఆ యజమాని లోపలి తీసుకెళ్ళాడు, అక్కడ అసలు విషయాన్నీ చుసిన పోలీసులు షాక్ అయ్యారు. తన ఇంట్లో పెంచుకునే చిలుక ఇదంతా చేసిందని, దాని పేరు రాంబో అని, రాంబో ని బోనులో ఉంచినపుడల్లా ఇలానే అల్లరి చేస్తూ అరుస్తుందని చెప్పాడు ఆ యజమాని. దానితో పోలీసులు నవ్వుకొని బయటకి వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news