వరద బాధితులకు ఉచితంగా నిత్యవసర సరుకులు – భట్టి ప్రకటన

-

వరద బాధితులకు ఉచితంగా నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి ప్రకటన చేశారు. నిరాశ్రయులకు తక్షణమే నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తామని.. వరద ఉధృతి తగ్గిన తర్వాత నష్టం అంచనా వేయించి ఆదుకుంటామన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా వైద్య ఆరోగ్యశాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నదని…. ఖమ్మంలో జరిగిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

We will immediately distribute essential commodities to the homeless

రాజకీయంగా సోషల్ మీడియాలో బతికెస్తున్న కేటీఆర్, హరీష్…వరదలపై మాట్లాడటం దారుణమన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధ రహితమని… బిఆర్ఎస్ పాలకుల మాదిరిగా గడీల్లో పడుకోలేదు ప్రజల మధ్యన ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం హై అలర్ట్ గా ఉన్నందునే స్వల్ప ప్రాణ నష్టం కూడా జరగలేదని… అర్ధరాత్రి కూడా పనిచేస్తూ విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూస్తున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు. జంట నగరాల్లో వరద విపత్తును ఎదుర్కోవడానికి హైడ్రా ను సిద్ధం చేశామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news