బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన చంద్రబాబు..ఫోటోలు వైరల్

-

బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు. విజయవాడ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికేపాడు మీదుగా పొలాల్లో వెళ్లి బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు. పంటు మీద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపును పరిశీలించారు సీఎం చంద్రబాబు.

Chief Minister Chandrababu Naidu inspected the flooded area of __Budameru

బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పై అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు….దెబ్బతిన్న పంటలు వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ సాయంత్రం వరకు బుడమేరు ముంపు ప్రాంతంలోనే ఉండనున్నారు. కాగా ఇటీవల కురిసిన భారీవర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బుడమేరు వాగు ఉప్పొంగి విజయవాడ నగరం మొత్తం నీట మునిగింది. దీంతో ముంపు గ్రామాల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వం కోల్పోయిన మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news