A golden lizard in the forests of Seshachalam: తిరుపతి జిల్లాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తిరుపతిలోని శేషాచలం అడవులలో బంగారు బల్లి ప్రత్యక్షమైంది. ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే తొలిసారి ఏం కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే తాజాగా శేషాచలం అడవుల్లో అరుదైన జాతికి చెందిన బంగారు బల్లి ప్రత్యక్ష అయినట్లు… అధికారులు ప్రకటించడం జరిగింది. ఈ బంగారు బల్లి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లకు దర్శనం ఇచ్చినట్లు సమాచారం.
అటవీ శాఖ షెడ్యూల్ వన్ కింద పరిగణిస్తున్న బంగారు బల్లి చీకటి ప్రదేశాలలో అలాగే రాతిబండల్లో ఎక్కువగా నివసిస్తుందని చెబుతున్నారు. బంగారు కలర్ లో మెరిసిపోయే ఈ బల్లుల… జాడ ఇటీవల లేకుండా పోయిందని అధికారులు చెబుతున్నారు. అయితే తాజాగా… శేషాచలం అడవులలోని కళ్యాణి డ్యాం పరిధిలో… ఈ బంగారు బల్లి ప్రత్యక్ష అయిందట. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.