కశ్మీర్‌లో ఉగ్రవాదులను అడ్డుకోవడానికి గ్రామస్తులకు ఇండియన్ ఆర్మీ శిక్షణ

-

జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ చాలా ప్రశాంతంగా ఉంది. ప్రస్తుతం అక్కడ టూరిజం భారీగా అభివృద్ది చెందుతోంది. గతంలో మాదిరి అల్లర్లు, రాళ్లు విసురుకోవడాలు, ఉగ్రవాద చర్యలు కాస్త తగ్గుముఖం పట్టాయి. భద్రతా బలగాలు నిత్యం ముష్కరుల కోసం గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. ఇటీవల ఉగ్రవాదులు సైన్యాన్ని టార్గెట్ చేసి వారిపై కాల్పులు జరుపుతున్నారు. దీంతో టెర్రరిజంపై కౌంటర్ ఇచ్చేందుకు ఇండియన్ ఆర్మీ జమ్ములోని గ్రామస్తులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంది.

కశ్మీర్ పోలీసులతో కలిసి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ (VDG)లను సిద్దం చేస్తున్నట్లు ఆర్మీ ప్రకటించింది. ప్రస్తుతం 600 మంది గ్రామంలోని యువత ఆర్మీ శిక్షణ తీసుకుంటున్నారని, ఆటోమెటిక్ రైఫిల్స్ వాటం,డ్రిల్స్, చిన్నపాటి మెళకువలు వారికి నేర్పిస్తున్నట్లు తెలిపింది. ఒక్కో విడీజీ విభాగానికి 3 రోజుల శిక్షణ అందిస్తున్నట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news