ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీలో ఫ్లెక్సీల లొల్లి నెలకొంది. ఖైరతాబాద్ వినాయకుడి సాక్షిగా కాంగ్రెస్‌లో విబేధాలు బయటపడ్డాయి. ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ వర్సెస్ విజయా రెడ్డి అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి. నిన్న ఖైరతాబాద్ గణేశ్ పూజకు వస్తున్న రేవంత్ రెడ్డికి ఏర్పాటుచేసిన స్వాగత ఫ్లెక్సీల్లో విజయారెడ్డి ఫొటో పెట్టలేదట దానం నాగేందర్.
దీంతో ఈ విషయం వివాదంగా మారిందట. ఈ తరుణంలోనే అప్పటికప్పుడే స్టిక్కర్‌తో విజయా రెడ్డి ఫొటో అతికించారట. అటు తానేం తక్కువ కాదంటూ తన ఫ్లెక్సీల్లో దానం నాగేందర్ ఫొటోను పెట్టలేదట విజయా రెడ్డి. గతంలో వీరిద్దరూ బద్ద శత్రువులుగా ఉండేవారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఒకే పార్టీలో ఉండడంతో విభేదాలు నెలకొన్నాయి. అధికారం వచ్చినా తనకు గుర్తింపు లేకపోవడంతో విజయా రెడ్డి వర్గం అసంతృప్తి ఉన్నట్లు సమాచారం.
https://x.com/TeluguScribe/status/1832700424496853366