గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన జేసీ దివాకర్ రెడ్డి!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబాలలో జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ ఒకటి. జెసి దివాకర్ రెడ్డి పేరు చెప్పగానే ఏపీలో రాజకీయంగా తెలియని వారు అంటూ ఉండరు. తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వరసత్వంతో జెసి దివాకర్ రెడ్డి 1985 నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు.

2004 – 2006లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు జేసి. 2010 కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో జెసి దివాకర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించలేదు. ఇక 2011లో ప్రొటెమ్ స్పీకర్ గా పనిచేశారు జేసీ. ఆ తరువాత 2014 మేలో అనంతపురం నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా జెసి దివాకర్ రెడ్డి తనయుడు జెసి పవన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.

ఇలా సీమ రాజకీయాలలో వెలుగు వెలిగిన జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. దివాకర్ రెడ్డి తాజా ఫోటోని ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి ఎక్స్ లో షేర్ చేయగా.. ఈ ఫోటోలో ఆయన కుమారుడు పవన్ రెడ్డి, మనవడితో కలిసి దివాకర్ రెడ్డి కనిపించారు. గతంలో గంభీరంగా కనిపించే దివాకర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా డీలపడ్డారు. అయితే ఆయనకు జ్ఞాపక శక్తి తగ్గిందని, నడవడం కూడా ఇబ్బందిగా ఉందని పలువురు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news