మహిళను అసభ్యంగా తాకిన వ్యక్తి.. బట్టలు విప్పించి చితకబాదిన జనం!

-

ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆమె ప్రైవేట్ పార్ట్స్ ముట్టుకున్న 33 ఏళ్ల వ్యక్తిని స్థానికులు పట్టుకుని బట్టలు విప్పించి మరీ చితకబాదారు. ఈ ఘటన బెంగళూరు శివారులోని కాల్‌కరే గ్రామంలో చోటుచేసుకుంది.ధర్వాడ్‌కు చెందిన రవికుమార్ రెండేళ్లుగా కాల్‌కరే సమీపంలోని ఓ హోటల్‌లో కుక్‌గా వర్క్ చేస్తున్నాడు.రాత్రి 10 గంటల టైంలో ఓ యువతి (20) పాలు కొనేందుకు రోడ్డుపైకి రాగా, రవికుమార్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆమె బాడీని అనుచితంగా తాకాడు.దీంతో ఆమె భయంతో కేకలు వేసింది. వెంటనే చుట్టుపక్కల వారు వచ్చి నిందితుడిని పట్టుకున్నారు. దాదాపు 12 మంది కలిసి అతడిపై దాడి చేయగా బాధిత మహిళ అక్కడి నుంచి పారిపోయింది.

అయితే, నిందితుడిని పట్టుకున్న చుట్టుపక్కల వారు అతడి ధోతీని విప్పించి కాళ్లు,ఇతర శరీర భాగాలపై దారుణంగా దాడిచేశారు.అనంతరం ఓ ఆటోలో నిందితుడిని తీసుకెళ్తుండగా విషయం తెలిసిన పోలీసులు వారి చెర నుంచి బాధితుడిని రక్షించారు.తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు.బాధితుడిపై ఉద్దేశపూర్వకంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. దాడి చేసిన వారిలో ముగ్గురిని అరెస్ట్ చేశామని,మిగతా వారిని కూడా పట్టుకుంటామన్నారు.బాధితురాలిని కలిసి వివరాలు సేకరించామని, అయితే, ఆమె ఫిర్యాదు చేసేందుకు నిరాకరించిందని చెప్పారు. బాధిత వ్యక్తి మద్యం మత్తులో అసభ్యంగా తాకినట్టు పోలీసులు నిర్దారించారు.

Read more RELATED
Recommended to you

Latest news