ఎన్టీఆర్ ‘దేవర’ ట్రైలర్ టైమ్ ఫిక్స్..!

-

టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైనటువంటి కొరటాల దర్శకత్వం వహించిన పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

సెప్టెంబర్ 10న ముంబయిలో దేవ చిత్రం యొక్క ట్రైలర్ విడుదల చేయనున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఓ కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రేపు సాయంత్రం 5.04 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ 9 సెంటిమెంట్ దీనికి కూడా వర్తించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర ప్రమోషన్లలో ముంబయిలో చాలా బిజీగానే ఉన్నారు. రేపు సాయంత్రం విడుదలయ్యే దేవర ట్రైలర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Latest news