ప్రకాశం బ్యారేజీ బోట్ల వెనుక నారా లోకేష్ కుట్రలు ఉన్నట్లు పోస్ట్ పెట్టింది వైసీపీ. ప్రకాశం బ్యారేజీ వద్దకు వరదకు కొట్టకొచ్చిన బోట్ల కేసు నిందితుడు నారా లోకేష్ కు సన్నిహితుడేనంటూ వైసీపీ పేర్కొంది. ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకురావడం వెనుక కుట్రకోణం ఉందంటూ గత అర్థరాత్రి పోలీసులు కోమటి రామ్మోహన్, ఉషాద్రి అనే ఇద్దరు వ్యక్తులను చంద్రబాబు ఆదేశాలపై పోలీసులు అరెస్టు చేశారని తెలిపింది.
వీరిలో రామ్మోహన్ పేరుమీద ఒక్క బోటు కూడా లేదని…. నాలుగైదేళ్ల క్రితమే తన బోట్లను అమ్మేశారని తెలిపింది వైసీపీ. పైగా రామ్మోహన్ టీడీపీ ఎన్నారై విభాగం అధ్యక్షుడు కోమటి జయరాంకు సమీప బంధువు. ఈ కేసులో అరెస్టయిన రెండో వ్యక్తి ఉషాద్రి తనకు వైయస్సార్‌సీపీతో సంబంధాలు లేవని స్పష్టంచేసినా పోలీసులు అతన్ని ఇరికించి అరెస్టుచేశారని తెలిపింది వైసీపీ. నారా లోకేష్‌తో ఉషాద్రికి సంబంధాలు ఉన్నాయనేదానికి ఈ ఫోటోలే సాక్ష్యాలు అని ఫోటోలు రిలీజ్ చేసింది. కానీ టీడీపీ మాత్రం నందిగాం సురేష్ కుట్రలు అంటూ చెబుతోంది.
https://x.com/YSRCParty/status/1833059949854806307