ATMలో రోజుకు ఎంత విత్ డ్రా చేయొచ్చు..? టాప్ బ్యాంకుల లిమిట్ ఎంతో తెలుసా..?

-

ఇప్పుడు అందరూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చూస్తున్నారు. దీంతో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. నగదు వినియోగం మాత్రం తగ్గడం లేదు. చాలామంది ఇప్పటికీ నగదు వినియోగదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎక్కువగా ఏటీఎంలో నుంచి నగదు తీసుకుని అవసరాలను తీర్చుకుంటున్నారు. ఏటీఎం నుంచి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డులని ఉపయోగించి విత్డ్రా చేసుకోవడం చాలా ఈజీ. అయితే ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోవడానికి కుదరదు. ఏ కార్డు ఎంత లిమిట్ వరకు ఉంటుందనేది చూద్దాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ రకాల డెబిట్ కార్డ్స్ ని అందిస్తోంది. వాటి ప్రకారం ఏటీఎం నుంచి విత్డ్రావ్ చేసుకోవచ్చు. క్లాసిక్ డెబిట్ కార్డ్, మాస్టర్ కార్డులతో రోజుకి 40,000 డ్రా చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ కార్డు ఉంటే లక్ష వరకు తీసుకోవచ్చుమెట్రో నగరాల్లో మూడు ఇతర నగరంలో ఐదు ఉచిత ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఎస్బీఐ ఎటిఎం అయితే 5 ఇతర బ్యాంక్ ఎటిఎం అయితే 10 వసూలు చేస్తారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయానికి వస్తే ప్లాటినం డెబిట్ కార్డు మీద రోజుకు 50 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.

క్లాసిక్ డెబిట్ కార్డుతో 25, గోల్డ్ డెబిట్ కార్డు తో 50 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి విషయానికి వస్తే మిలీనియా, టైటానియం, ఇంటర్నేషనల్ బిజినెస్ రివార్డ్స్ కార్డుల పై 50వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. మనీ బ్యాక్ డెబిట్ కార్డ్, ఎన్ఆర్ఐ కార్డు ఉంటే 25 తీసుకోవచ్చు. టైటానియం, రాయల్ డెబిట్ కార్డ్ ఉంటే 75000 వరకు రోజుకు తీసుకోవచ్చు. కోరల్ ప్లస్ డెబిట్ కార్డు ఉంటే 1,50,000 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు ఎక్స్ప్రెస్ ప్లాటినం టైటానియం డెబిట్ కార్డు ఉంటే లక్ష వరకు తీసుకోవచ్చు. స్మార్ట్ పోషర్ సిల్వర్ కార్డు ఉంటే 50,000, సఫీరో కార్డు ఉంటే 2.50 లక్షలు తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news