కౌశిక్ రెడ్డికి బూట్లు చూపించిన మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శోభా రాణి..!

-

పాడి కౌశిక్ రెడ్డి..చీరలు గాజులు వేసుకునే వాళ్ళు ఎవరూ చేతకాని వాళ్ళు కాదు అని మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శోభా రాణి పేర్కొంది. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డికి బూట్లు చూపించింది మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శోభా రాణి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. గాజులు పెట్టుకునే వాళ్ళు చేతకాని వాళ్ళు అనుకుంటే నీ ఇంట్లో బిడ్డా.. భార్య ఉంది.. వాళ్లు కూడా చేతకానీ వాళ్లా..? మహిళలను అడ్డుపెట్టుకుని గెలిచిన చరిత్ర పాడి కౌశిక్ రెడ్డిది అన్నారు.

మహిళలను అవమానిస్తే..చెప్పు దెబ్బలు తింటావు. చీర, గాజులు ముందు కేసీఆర్, కేటీఆర్ లకి పంపు. బీఆర్ఎస్  పుట్టుకనే..ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాక్కుని పుట్టింది. కేసీఆర్ ఏ పార్టీలో పుట్టాడు.. నీ పక్కన కూర్చున్న ఎమ్మెల్యేలు ఏ పార్టీలో పుట్టాడో తెలుసుకో ఫస్ట్. చరిత్ర తెలవకుండ మాట్లాడకు..?  అసభ్యంగా ప్రవర్తించిన కౌశిక్ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొంది శోభారాణి.

Read more RELATED
Recommended to you

Latest news