ష‌ర్మిల స్వ‌రం మారుతోందా….హైక‌మాండ్ ఏం చెప్పింది

-

ఏపీ రాజ‌కీల‌యాల్లో చ‌క‌చ‌కా మార్పులు వ‌చ్చేస్తున్నాయి.ఈరోజు ఉన్న ప‌రిస్థితులు రేప‌టికి మారిపోతున్నాయి.నేడు ఒక పార్టీతో ఉన్న పొత్తు తెల్లారేస‌రికి తెగిపోతుంది.అలాంటి మార్పు ఏపీ కాంగ్రెస్‌లో క‌నిపిస్తోంది.నిన్న‌టి వ‌ర‌కు అన్న జ‌గ‌న్‌ను టార్గెట్ చేసిన షర్మిల ఇప్పుడు టీడీపీని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు.ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ఆమె విచురుకుప‌డుతున్నారు. పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటివరకు జగన్ పైనే ఫోకస్ పెట్టారు షర్మిల. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కంటే జగన్ పతనాన్ని ఎక్కువగా కోరుకున్నారు.

జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఎన్నికల్లో ఎంత డ్యామేజ్ చేయాలో అంతలా చేశారు. జగన్ ఓటమికి షర్మిల ప్రధాన కారణం అయ్యారు. జగన్ ఓటమి తరువాత కూడా ఆయన్నే టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. కూటమి ప్రభుత్వం అధికారపక్షంగా ఉన్నా విమర్శలు చేయడం లేదు. అయితే తాజాగా చంద్రబాబు సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు షర్మిల. ఘాటైన ప‌దాల‌తో ఆరోప‌ణ‌లు చేస్తూ ఏకంగా ఎన్డీఏ నుంచి బయటకు రావాలని చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చేశారు. ష‌ర్మిల‌లో ఏంటి ఈ మార్పు అని ఏపీలో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది.

ఏపీలో ప్ర‌స్తుతం టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అదే కూటమి జాతీయస్థాయిలో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది. కానీ ఏపీ సర్కార్ తో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోంది. సిద్ధాంతపరంగా టిడిపి కూటమి తమకు వ్యతిరేకమని తెలిసినా పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల పెద్దగా విమర్శలు చేసిన సందర్భాలు లేవు. ఆమె నోరు తెరిస్తే జగన్ ను టార్గెట్ చేయడం పరిపాటిగా మారింది. ఇటీవల విజయవాడను వరదలు ముంచెత్తాయి. లక్షలాదిమంది నిరాశ్రయులు అయ్యారు. ప్రభుత్వపరంగా సహాయ చర్యలు ముమ్మరంగా సాగాయి.

వరద నియంత్రణ చర్యల్లో స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగారు. అయితే ఇది ముమ్మాటికి చంద్రబాబు సర్కార్ వైఫల్యం అని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. వరద నియంత్రణతో పాటు బాధితులకు సహాయం అందించడంలో సైతం ప్రభుత్వం విఫలమైందని తీవ్ర ఆరోపణలు చేశారు జగన్. అయితే దీనిపై స్పందించిన షర్మిల జగన్ వ్యాఖ్యలను ఖండించారు. చంద్రబాబు సర్కార్ బాగానే పనిచేస్తుందన్న రీతిలో మాట్లాడారు. విజయవాడ వరదలకు జగన్ కారణమని ఆరోపించారు. తద్వారా చంద్రబాబును మరోసారి వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు ష‌ర్మిల‌.

అయితే ఇప్పుడు ఉన్న‌ట్టుండి చంద్రబాబు సర్కారుపై విరుచుకుపడుతున్నారు షర్మిల రెడ్డి. ఏపీ ఎంపీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని ఆమె ఆరోపించ‌డం సంల‌నంగా మారింది. కేంద్రం నుంచి నిధులను రాబెట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారని కొత్త‌రాగం అందుకున్నారు. అటువంటప్పుడు ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. తక్షణం ఎన్డీఏ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. అయితే జాతీయస్థాయిలో మారిన రాజకీయ పరిస్థితులు..

కర్ణాటకలో జగన్ ప్యాలెస్ లో కాంగ్రెస్ కీలక నేతల సమావేశాలు.. తదితర కారణాలతోనే షర్మిల స్వరం మారినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మాట్లాడుతున్న‌ట్లే మున్ముందు ఆమె చంద్రబాబు సర్కారును టార్గెట్ చేస్తే మాత్రం ఏపీ రాజకీయాలు మ‌రింత ఆస‌క్తిగా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.అయితే ఎలాంటి ట‌ర్న్ తీసుకుంటాయోన‌ని అటు విశ్లేష‌కులు సైతం రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news