ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీల రచ్చపై మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి సీరియస్ అయ్యారు.హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఊరుకోమని హెచ్చరించారు.ముఖ్యంగా హైదరాబాద్లో ఆంధ్ర,తెలంగాణ మధ్య విబేధాలు సృష్టించొద్దని వార్నింగ్ ఇచ్చారు.ఇక ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు సరైనవి కావని సూచించారు. ఇదిలాఉండగా, కౌశిక్ రెడ్డి ఇంటి ముందు అరికెపూడి గాంధీ వర్గీయులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
దీంతో అరికెపూడి గాంధీతో పాటు ౩౦ మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు.అదే టైంలో హరీశ్ రావు సహా బీఆర్ఎస్ కార్యకర్తలు సీపీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగడంతో వారిని కూడా అరెస్ట్ చేశారు.ఇక శుక్రవారం గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామంటూ కౌశిక్ రెడ్డి కామెంట్స్ చేయడంతో సర్వత్రా టెన్షన్ నెలకొంది.ఒకవేళ అదే జరిగితే పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన పోలీసులు ఈ రోజు (శుక్రవారం) ఉదయం నుంచి అరికెపూడి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. హరీశ్ రావు,కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు.