వివాదంలో తీన్మార్ మల్లన్న.. ఆ కులాన్ని పచ్చి బూతులతో తిడుతూ..!

-

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ప్రస్తుతం చాలా రసవత్తరంగా మారాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికెపూడి గాంధీ మధ్య వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వార్ లో పలువురు కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతలు నిన్న దాడులు కూడా చేసుకున్నారు. ఇవాళ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేత ఇంటి వద్దకు వెళ్లాలని ప్రయత్నించగా.. పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారు.

మరికొంత మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా మరో సంచలన సంఘటన చోటు చేసుకుంది. స్పీకర్ సుఖేందర్ రెడ్డి గారు.. మీ శాసనమండలి సభ్యుడు ఒక కులాన్ని కించపరచడం ఎంతవరకు సబబు అని.. ఆ వ్యక్తితో ఆయనకు సెటిల్మెంట్ కాకుంటే యావత్ ఆర్యవైశ్య కులాన్ని బలుపు అనాలా ? అని ప్రశ్నించారు ట్విట్టర్ లో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. ఆర్యవైశ్యులకు తక్షణమే తీన్మార్ మల్లన్న క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈయన రాజకీయ సోపతి ధర్మపురి అరవింద్ కూడా స్పందించాలన్నారు. అరెయ్ శివ శంకర్.. మీ కోమటి బతుకు ఏదైతే ఉందో.. అది తగ్గించుకో బిడ్డ అని తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

Read more RELATED
Recommended to you

Latest news