ఉత్తమ్ కమిటిని ఉపసంహరించుకోవాలి : ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి

-

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీని వెంటనే ఉప సంహరించుకోవాలని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి. చెన్నయ్య డిమాండ్ చేశారు. ఇవాళ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ అమలు కోసం మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడాన్ని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తోంది. ఎస్సీల అభిప్రాయాన్ని సేకరించకుండా వర్గీకరణ అమలు పేరుతో కమిటి వేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అన్నారు. ఇది ఏకపక్షంగా ఉన్న ఈ మంత్రుల కమిటితో తెలంగాణ లో మాల, మాల అనుబంధ కులాలకు ఏమాత్రం న్యాయం జరగదు అన్నారు.

ఏ ఒక్క మాల మంత్రి లేకుండా కమిటిని ఎలా నియస్తారని ప్రశ్నించారు. మంత్రుల కమిటీ లోనే మాలలకు అన్యాయం జరిగింది. మంత్రుల కమిటీలో మాల మంత్రి ఎందుకు లేరని ప్రశ్నించారు.
ఏకంగా మంత్రుల కమిటీ లోనే మాలలకు అన్యాయం జరిగితే.. ఇక ఈ కమిటీ మాల సమాజానికి ఎలా న్యాయం చేస్తుందని.. అసలు మాల మంత్రి భాగస్వామ్యం లేని ఈ కమిటీని మేము స్వాగతించడం లేదన్నారు.  ఒక రెడ్డి, ఒక మాదిగ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక బ్రాహ్మణ సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు ఉన్నారు. కానీ  మాల సామాజిక వర్గం నుంచి మంత్రి కమిటీలో ఎందుకు లేరని ప్రశ్నించారు. ఇది మాలలకు జరిగిన అన్యాయం కాదా..? అన్నారు. తెలంగాణ లో మాదిగల జనాభా కంటే మాల, మాల ఉప కులాల జనాభా ఎక్కువగా ఉంది. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటితో మాలలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ మంత్రుల కమిటీని రద్దు చేసి సిట్టింగ్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news