ఏపీలో ఆన్‌లైన్ విక్రయాల కోసం ప్రత్యేక యాప్..

-

ఏపీలో రైతులతో పాటు వివిధ సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తులను ఆన్‌లైన్ వేదికగా విక్రయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకురానుంది. ప్రొడక్ట్స్ అమ్మకం, కొనుగోలు కోసం ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనికి సంబంధించి పాలసీ తయారీ కోసం ఒక కమిటీని, పర్యవేక్షణ కోసం మరో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఈ ఆన్‌లైన్ వేదిక అందుబాటులోకి వస్తే ఏపీ రైతులు, వివిధ ఉత్పత్తి దారులకు ఎంతగానో సాయం కానుంది. ఎందుకంటే రైతులు, ఉత్పత్తి దారులకు సంబంధించి ఐటమ్స్ నేరుగా మద్దతు ధరకు విక్రయించుకోవచ్చును. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది.త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణలో ఈ ఆన్‌లైన్ మార్కెటింగ్ విధానం నడవనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news