బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఆంధ్ర అని తెలీయలేదా మీకు? : ఇందిరా శోభన్

-

తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వర్సెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల మధ్య అగ్గి రాజుకుంటోంది.మొన్నటివరకు వారి అసెంబ్లీ సభ్యత్వాలను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి,కేపీ వివేకానందలు అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీలను కలిసి వినతి పత్రాలు అందజేశారు. అయితే, అరికపూడి గాంధీ ఇంటిపై గులాబీ జెండా ఎగరేస్తానని కౌశిక్ రెడ్డి ప్రకటించడంతో అది గాంధీ వర్గం కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడించి దాడి చేశారు.

ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి బతకడానికి వచ్చిన ఆంధ్ర వ్యక్తి అంటూ గాంధీని విమర్శించడంతో ప్రస్తుతం మరోసారి సెంటిమెంట్ రాజుకుంది.తాజాగా దీనిపై కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాశోభన్ స్పందించారు.అరికపూడి గాంధీ బీఆర్ఎస్‌లో ఉన్నంతకాలం ఆయన ఆంధ్ర అని తెలీదా? ఇంతకాలానికి గుర్తొచ్చారా? కేసీఆర్ ఆంధ్ర వాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్నారు? ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు? మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news