చెన్నూరులో గణేశ్ నిమజ్జనంలో ఉద్రిక్తత.. కత్తితో యువకుడి హల్చల్

-

గణపతి నిమజ్జనం సందర్భంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు కొత్తగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిమజ్జనం శోభాయాత్రలో భాగంగా ఓ యువకుడు హల్‌చల్ చేశారు. రోడ్డుపై వెళ్తున్న వారిని చంపేస్తానంటూ కత్తితో బెదిరింపులకు దిగాడు.దీంతో అతనిపై మరో వర్గం దాడి చేసింది.విషయం తెలుసుకున్న పోలీసులు అందరినీ చెదరగొట్టారు. యువకుడి చేతిలోని కత్తిని స్వాధీనం చేసుకున్నారు.గ్రామంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. కాగా, కొత్తగూడెంలో అడుగుగడునా సీసీ కెమెరాలు ఉన్నాయని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు.ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.వినాయక విగ్రహాలను నిమజ్జనం కోసం తీసుకెళ్లే సమయంలో కరెంట్ తీగలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఊరేగింపులో బాణా సంచా కాల్చకూడదని సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news