మద్యం ప్రియులకు శుభవార్త.. అక్టోబర్ 01 నుంచి కొత్త విధానం అమలు

-

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో మద్యం ధరలు విపరీతంగా పెరిగాయని ప్రజలు పేర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం నూతన మద్యం పాలసీని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. సీఎం చంద్రబాబు తో సచివాలయం వేదికగా ఇవాళ మంత్రి వర్గ ఉప సంఘం భేటీ అయింది. ఈ నేపథ్యంలో వారు కీలక నిర్ణయం తీసుకునన్ారు. బుధవారం కొత్త మద్యం పాలసీని కేబినెట్ ఎదుట ప్రవేవపెట్టబోతున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ 01వ తేదీ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ విధానం తీసుకొచ్చే విధంగా ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు.

మరో ఆరు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను పరిశీలించినట్టు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులను ఇస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో మద్యం ధరలను విపరీతంగా పెంచారు. మద్యం ధరలు పెరగడంతో పేదలు గంజాయికి అలవాటు పడ్డారని.. తక్కువ ధరకే మద్యం ఇస్తామని పేర్కొన్నారు. పలు మార్పులు, చేర్పులతో పాటు తదుపరి కార్యచరణ పై మంత్రి వర్గ ఉప సంఘానికి సీఎం చంద్రబాబు కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news