డీఎస్పీగా నియామ‌క ప‌త్రం అందుకున్న బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌..!

-

తెలంగాణ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌ గురించి అందరికి తెలిసిందే. అయితే ఆమెకు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించగా.. తాజాగా తెలంగాణ డీజీపీ జితేంద‌ర్ చేతుల మీదుగా డీఎస్పీగా నియామ‌క ప‌త్రం అందుకుంది నిఖ‌త్ జ‌రీన్‌. అయితే ఆమెకు మూడేళ్ల పాటు ప్రొబెష‌న‌రీ ట్రైనింగ్‌ ఇవ్వనున్నారు.

అయితే గ‌త నెల 1వ తేదీన జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో సెక్ష‌న్ 4లోని తెలంగాణ రెగ్యులేష‌న్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్‌కు స‌వ‌ర‌ణ చేసి నిఖ‌త్‌కు ఉద్యోగం ఇవ్వాల్సిందిగా హోంశాఖ‌ను ప్ర‌భుత్వం ఆయాదేశించిన సంగతి తెలిసిందే. ఇక నిజామాబాదు కు చెందిన నిఖ‌త్ జ‌రీన్‌ రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. దాంతో ఒలంపిక్స్ 2024 లో ఆమెపై మెడల్ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ సెమీ ఫైనల్స్ కూడా చేరకుండా.. నిఖ‌త్ జ‌రీన్‌ చైనీస్ సీడెడ్ బాక్సర్ చేతిలో ఓడిపోయింది. దాంతో అభిమానులు నిరాశ చెందిన.. నిఖ‌త్ జ‌రీన్‌ సాధించిన విజయాలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఆమెకు ఈ డీఎస్పీ పోస్ట్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news