జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. గోవాలో జానీ మాస్టర్ ను అరెస్టు చేశారు పోలీసులు. అనంతరం గోవా కోర్టులో జానీ మాస్టర్ ను హాజరు పరుస్తున్నారు పోలీసులు. గోవా కోర్టులో హాజరు పరిచి… పిటి వారింట్ కింద హైదరాబాద్ తరలించనున్నారు అధికారులు. ఇక రేపు ఉప్పరపల్లి కోటలో జానీ మాస్టర్ ను హాజరు పరుచనున్నారు పోలీసులు. ఈ తరుణంలోనే… నార్సింగి పోలీస్ స్టేషన్ కు జానీ మాస్టర్ భార్యను తీసుకొని వచ్చారు పోలీసులు.
దీంతో ఆమెను కూడా అరెస్ట్ చేశారని అంటున్నారు. కానీ తానే నార్సింగి పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా చెబుతున్నారు. తన భర్త జానీ… పోలీస్ స్టేషన్లో ఉన్నాడని ఫోన్ కాల్ సమాచారం వచ్చిందని అంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఫేక్ కాల్ అని తెలిసిందన్నారు. అధికారులను కలిసి తిరిగి వెళ్ళిపోతున్నానని ఆమె వెల్లడిస్తున్నారు.