ఖర్గే, రాహుల్ గాంధీకి హరీష్ రావు బహిరంగ లేఖ..

-

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష, వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ.., రేవంత్ రెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు.

harish rao letter to rahul gandhi and kharge

కాంగ్రెస్ పార్టీ తనే ప్రవచించిన ప్రమాణాలను పాటించకపోవడం ద్వంద ప్రమాణాలకు నిదర్శనమని చురకలు అంటించారు. రేవంత్ రెడ్డి మాజీ సీఎం కే.సి.ఆర్ గారిపై దూషణలు, కించపరచే వ్యాఖ్యలు చేయడం అతని దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. రాహుల్ గాంధీపై బిజెపి తీవ్రవాది అని వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. రాజకీయాల్లో దిగజారుడు విమర్శలను తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగ విలువలను దిగజారుస్తున్నారని మొసలి కన్నీరు కార్చిందని ఆగ్రహించారు. అలాంటి దూషణలే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే హై కమాండ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇది కాంగ్రెస్ పార్టీ డబల్ స్టాండర్డ్స్ కాదా? అంటూ నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news