యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు అమెరికా అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ నుంచి ఆహ్వానం..!

-

రాజ్యసభ మాజీ సభ్యులు, పద్మశ్రీ, పద్మ భూషణ్ పురస్కారాల గ్రహీత డా.యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. యార్లగడ్డ రాజకీయాల్లోకి రాక ముందు ఆంధ్ర విశ్వకళా పరిషత్, హిందీ విభాగంలో ఆచార్యుడిగా పని చేశారు. ఈయన హిందీలో యం.ఎ. పట్టా పొంది, తెలుగు, హిందీ భాషలలో పి.హెచ్.డి. పట్టాలు సాధించాడు. నందిగామ కె.వి.ఆర్ కళాశాలలో అధ్యాపకునిగా, ఆంధ్ర లయోలాకళాశాలలో హిందీ విభాగపు అధ్యక్షునిగా పనిచేసిన పిదప ఆంధ్ర విశ్వకళా పరిషత్, హిందీ విభాగములో ఆచార్య పదవి పొందినాడు.

ఆచార్యునిగా 29 మంది విద్యార్థులకు పి.హెచ్.డి. మార్గదర్శకము చేశాడు. హిందీ భాష, సాహిత్యములలో విశేష కృషి చేస్తున్నాడు. పలు తెలుగు గ్రంథాలు హిందీలోకి అనువాదము చేశాడు. తెలుగులో 32 పుస్తకాలు రచించాడు. లక్ష్మీ ప్రసాద్ సాంస్కృతిక సాహితి రాయబారిగా యు.ఎస్.ఎ., మలేషియా, కెనడా, ధాయ్ లాండ్, సింగపూరు, ఇంగ్లాండ్, ప్రాన్స్, మారిషన్, రష్యా వంటి అనేక దేశాలు పర్యటించాడు. దీంతో తాజాగా మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు అమెరికా అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ నుంచి ఆహ్వానం అందింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తమకు  సహకరించాలని కోరారు కమలా హ్యారీస్.

Read more RELATED
Recommended to you

Latest news