రాజన్న సిరిసిల్ల జిల్లా లోని కోనారావుపేట మండలం మర్రిమడ్ల లోని ఏకలవ్య గురుకుల పాఠశాలను ఇవాల సందర్శించారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్. గురుకుల పాఠశాలలో భోజనం, సౌక్యారాలు, టీచింగ్ వివరాలను అడిగి తీసుకున్నారు బండి సంజయ్. భోజనం మంచిగా ఉండడం లేదని, అన్నం లో రాళ్ళు వస్తున్నాయని బండి సంజయ్ కి దృష్టికి తీసుకెళ్లారు విద్యార్థులు. దీంతో అధికారుల పై సీరియస్ అయ్యారు బండి సంజయ్. మరో సారి ఇలాంటివి నా దృష్టికి వస్తె ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఆకస్మికంగా పాఠశాల తనిఖీ చేస్తానని అధికారులు హెచ్చరించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం 2018- 19 లో దేశవ్యాప్తంగా బ్లాక్ ల వారీగా 50 శాతం ఎక్కువ ఉన్న ఆదివాసి, గిరిజన, ఎస్సీ, ఎస్టీ ఉన్న బ్లాకులో ఏకలవ్య పాఠశాలను మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 2022 లో 20% జనాభా ఉన్న బ్లాకు ల్లో కూడా ఏకలవ్య పాఠశాలలో మంజూరు చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 728 పాఠశాలను ప్రారంభించాలని కేంద్రం మంజూరు చేసింది. ఇప్పటివరకు 410 పాఠశాల నిర్మాణం జరుగుతుంది మిగిలినవి ప్రారంభించాల్సి ఉందని తెలిపారు.