మిలాద్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. ఈ తరునంలోనే.. చార్మినార్ వద్ద పోలీసులు లాఠీఛార్జ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. డీజే వ్యాన్‌లో మంటలు చెలరేగడంతో చార్మినార్ ప్రాంతంలో పరిస్థితులు అదుపుతప్పాయి. దీంతో లాఠీఛార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారు పోలీసులు. అయితే.. చార్మినార్ వద్ద పోలీసులు లాఠీఛార్జ్ చేసినట్లుగా వస్తున్న వార్తలపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనందర్ స్పందించారు.
చార్మినార్ వద్ద ఎలాంటి లాఠీచార్జి జరగలేదని క్లారిటీ ఇచ్చారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్. చార్మినార్ వద్ద మిలాద్ నబి పండుగను ఉద్దేశించి ఏర్పాటు చేసిన డీజే వద్ద షార్ట్ సర్క్యూట్ అయిందని తెలిపారు. ఈ తరునంలోనే… పక్కనే ఉన్న డీజిల్ ట్యాంక్ దగ్గరికి మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా మంటలు పెరిగాయని చెప్పారు. అది అదుపులోకి తేవడం జరిగిందన్నారు, లాఠీ చార్జ్ అని వస్తున్న పుకార్లనీ నమ్మద్దు అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ పేర్కొన్నారు.