కుక్కలు ఎందుకు ప్రయివేట్ పార్ట్స్ వాసన చూస్తాయి..?

-

సాధారణంగా మన ఇంట్లో కుక్కలు ఉన్నా లేదంటే ఎవరింట్లోనైనా కుక్కలు ఉన్నా మనం దీనిని గమనిస్తాము. కుక్కలు ప్రైవేట్ పార్ట్స్ దగ్గరకు వచ్చి వాసన చూస్తూ ఉంటాయి. ఎందుకు అవి అలా చేస్తాయి.? వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న కుక్కలు చేసే పని ఇదే. కుక్కలు మనిషి మూత్రవాసనను చాలా తీవ్రంగా గ్రహిస్తాయి. ఎందుకంటే వాటికి మనకు కంటే చాలా ఎక్కువ గ్రాహకాలు ఉంటాయి. వాటి ముక్కు మనకంటే కూడా ఎంతో శక్తివంతమైనది. వాసన ద్వారా అవి ఎన్నో విషయాలు తెలుసుకుంటాయి. లక్షల రెట్లు మనుషులు ముక్కు కంటే వాటి ముక్కు బలంగా ఉంటుంది.

ప్రైవేట్ పార్ట్స్ నుంచి వచ్చే వాసన ఒక్కొక్క జీవికి ఒక్కోరకంగా ఉంటుంది. ఈ వాసన ద్వారా కుక్కలు ఆ జీవి గురించి చాలా విషయాలు తెలుసుకుంటాయి. ఇది సహజమైన ప్రవర్తన కుక్కలు అన్నిటిని తెలుసుకొని చేస్తాయి మనల్ని కించపరచాలని లేదంటే ఇబ్బంది పెట్టాలని కాదు. మూత్రం వాసన చూడడం ద్వారా వాటి గురించి చాలా విషయాలు తెలుసుకుంటాయి. వయసు, లింగం, ఆరోగ్యం, సామాజిక స్థానం వంటి విషయాలు తెలుసుకుంటాయి. ఇతర కుక్కల్ని వాసన చూసే కుక్కలు తమ ప్రాంతాన్ని గుర్తిస్తాయి.

కుక్కలు తమ ప్రాంతంలోకి రాకుండా ఇది ఒక రకమైన సందేశం. కుక్కలు ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు మాత్రం వాసనని ఉపయోగిస్తాయి జంతువులు లేదా వస్తువుల నుంచి వచ్చే వాసనని అవి అనుసరిస్తాయి. కుక్కలు ఇతర కుక్కల్ని వాసన చూసే వాటి ఆరోగ్యం, వయసు, లింగం, గర్భవతి అయి ఉన్నాయో లేదో వంటి విషయాలు తెలుసుకుంటాయి. కుక్కలు ఆహారం లేదా నీరు ఉన్నచోటను కూడా వాసన ద్వారా కనుక్కుంటాయి. కుక్కలు ప్రమాదాలు లేదంటే అనారోగ్యం ఉన్న ప్రాంతాలను కూడా వాసన ద్వారా గ్రహించగలవు.

Read more RELATED
Recommended to you

Latest news