జగన్ ఇంటి ఎదుట బీజేపీ ధర్నా.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

-

తిరుమల లడ్డూ వివాదం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్ పాలనలో ఇదంతా జరిగిందని అధికార కూటమి సభ్యులు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలోనే తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటిని బీజేపీ యువ మోర్చా నేతలు ముట్టడించారు. ఇంటి బయట బైఠాయించి ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిందంటూ నిరసనకు దిగారు.

గత ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని, వెంటనే మాజీ సీఎం జగన్ హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.పలువురు ఆందోళనకారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా, శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ గత కొద్ది రోజులుగా టీడీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కల్తీకి సంబంధించి ఫుడ్ సేఫ్టీ రిపోర్టులను కూడా ఏపీ ప్రభుత్వం ఆధారాలుగా చూపించింది.

Read more RELATED
Recommended to you

Latest news