అల వైకుంఠపురములో.. ఈవెంట్ నిర్వాహకులపై పోలీసుల కేసు

-

రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ‘అల వైకుంఠపురములో..’ చిత్రంపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులను నమోదు చేశారు. సినిమా మ్యూజికల్ నైట్ వేడుక సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారంటూ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రేయాస్ మీడియా ఎండీ శ్రీనివాస్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మేనేజర్ గణేష్‌పై కేసులు నమోదు అయ్యాయి. ఈనెల 6న జరిగిన వేడుకకు దాదాపు 5 నుంచి 6 వేల మంది వరకూ అభిమానులు వస్తారని, రాత్రి 10 గంటల్లోపు కార్యక్రమం ముగుస్తుందని చెప్పారని ఆయన అన్నారు.

అయితే, దాదాపు 15 వేల మందిని నిర్మాణ సంస్థ ఆహ్వానించిందని, ఆరు వేల మంది దాటరని చెప్పి, మరింత మందిని తరలించడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఆటంకం ఏర్పడిందని అభియోగాలు నమోదు చేశారు. పైగా రాత్రి 11.30 గంటల వరకూ కార్యక్రమం జరిగిందని, స్వల్ప తొక్కిసలాట కూడా జరిగిందని, కార్యక్రమ నిర్వాహకుల నిర్లక్ష్యంతో పోలీసులు అభిమానులను నియంత్రించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఎస్ఐ నవీన్ రెడ్డి ఫిర్యాదు చేయగా, కేసును నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news