కూతురికి ఈ విషయాలను తల్లిదండ్రులు అస్సలు చెప్పకూడదు..!

-

కాలం మారిపోయింది. తల్లిదండ్రులు ఆడపిల్లల్ని పెంచే పద్దతిలో కొంచెం మార్పును తీసుకురావడం మంచిది. ఆడపిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఈ విషయాలని చెప్పకూడదు. ఇలా చేసినట్లయితే మీ ఆడపిల్ల కూడా ఉన్నత శిఖరాలని చేరుకుంటుంది. అనుకున్నది సాధించగలదు.

వేరే వాళ్ళు ఏమనుకుంటారు

వేరే వాళ్ళు ఏదో అనుకుంటారని మీ అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దూ. తనకి నచ్చిన పనులు చేయడానికి మీరు ప్రోత్సహించండి. అంతే కానీ ఇతరులు ఏమనుకుంటారో అని అక్కడితో ఆమెను ఆపేయొద్దు.

అమ్మాయిలా ప్రవర్తించమనడం .

అమ్మాయిలా ప్రవర్తించు. ఇవి అబ్బాయిలు చేసే పనులు అని తేడా చూపించద్దు. వాళ్లకి నచ్చినట్లు వాళ్ళని ఉండనివ్వండి. ఎదగడం కోసం బయటకు వెళ్లే మహిళల స్వేచ్ఛని పరిమితం చేయొద్దు.

ఇలా మా కాలంలో ఉండేది కాదు

ఇలా మా కాలంలో ఉండేది కాదు అని వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దు నచ్చిన పనులు చేయడానికి మీరు ప్రోత్సహించండి. కొత్త అవకాశాలని కల్పించడానికి ప్రోత్సహించాలి. అంతేకానీ అక్కడితో వాళ్ళని ఆపేయకూడదు.

పెళ్లి

చాలా మంది పెళ్లి చేసుకోమని పిల్లలకు చెప్తూ ఉంటారు. ఓ వయసు వచ్చిన తర్వాత లక్ష్యాన్ని చేరుకుందా లేదా అనేది చూడకుండా అమ్మాయిలకు పెళ్లి చేస్తారు. అలా ఎప్పుడూ చేయకూడదు. పెళ్లి చేసుకోవాలనేది ఆడవాళ్ళ సొంత నిర్ణయం కాబట్టి బలవంతం చేయొద్దు.

దుస్తులు

ఇలాంటి బట్టలు వేసుకో అలాంటి బట్టలు వేసుకోవద్దు అని వాళ్ళకి చెప్పకండి ఎటువంటి బట్టలు వేసుకోవాలనేది వారి వ్యక్తిగత నిర్ణయం. తప్పుడు పనులు చేస్తే చెప్పే హక్కు ప్రతి పేరెంట్స్ కి ఉంటుంది కానీ ప్రతి దాన్ని వ్యతిరేకించే హక్కు మాత్రం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news