భారత ప్రధాని నరేంద్ర మోడీ గొప్పతనాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించాలని ఎంపీ అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీ విదేశాలకు వెళ్లినప్పుడు 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిథ్యం వహిస్తున్నారని.. దేశ గౌరవాన్ని పెంచేవిధంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కేవలం ప్రధాని మోడీని వ్యతిరేకించడమే కాకుండా.. భారతదేశాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా భారతదేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతుందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ అమెరికాకు వెళ్లినప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తు చేశారు. భారతదేశానికి వ్యతిరేకంగా ఎజెండాను ప్రారంభించిన యూఎస్ ఎంపీతో రాహుల్ భేటీ అయ్యారని.. దేశ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అనురాగ్ ఠాకూర్. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 పునరుద్దరణకు పాకిస్తాన్ ప్రభుత్వం జమ్మూలోని కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ప్రయత్నిస్తున్నాయని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు ఎంపీ అనురాగ్ ఠాకూర్.