రజని కాంత్ దర్బార్ రివ్యూ

-

విడుదల తేదీ : జనవరి 09 , 2020

Manalokam రేటింగ్ : 2.5/5

నటీనటులు : రజినీకాంత్ , నయనతార , నివేథ థామస్

దర్శకత్వం : మురుగదాస్

నిర్మాత‌లు : అల్లీరా సుబాకరన్

సంగీతం : అనిరుథ్

తెలుగు సినిమా – తమిళ సినిమా – హిందీ సినిమా అనే తేడా లేకుండా కోట్లాది మంది సినిమా అభిమానులు రజినీకాంత్ దర్బార్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు . ఈ సినిమా మీద అంతమందికి ఎందుకు ఆస్క్థి అంటే .. చాలా కారణాలు ఉన్నాయి .. అన్నిటికంటే ముఖ్యమైనది రజిని ఫాక్టర్ .. దశాబ్దాలు గడుస్తున్నా రజినీకాంత్ హవా ఎక్కడా తగ్గడం లేదు .. మరొక పక్క మురుగదాస్ లాంటి స్టార్ డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం వల్ల కూడా ఆ క్రేజ్ ఉంది. ఇలాంటి టైమ్ లో ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది .. ట్రైలర్ కాస్త యావరేజ్ గా ఉన్నా, థియేటర్లో సినిమా ఏ మేరకు రాణించింది అనేది చూద్దాం రండి. తెలుగునాట రజినీకాంత్ కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంగతి అందరికీ తెలిసిందే , ఆయన తన గత సినిమాలతో అనేక బ్లాక్ బస్టర్లు కొట్టారు. ఈ సినిమాతో ఎంతవరకు హిట్ కొడతారు అనేది ఒకసారి అంచనా వేసే ప్రయత్నం చేద్దాం.

కథ – విశ్లేషణ :: ముంబైలోని ఒక టాప్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్న ఆదిత్య అరుణాచలం స్టోరీ ఇది. ఎవ్వరికీ తెలియని ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంటుంది ఆయనకి .. మరొక పక్క పొలిటికల్ లీడర్ ల సహాయంతో ముంబై మొత్తాన్ని ఆ మాటకు వస్తే దేశం మొత్తాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ విలన్ సునీల్ శెట్టి , అతను ఎలాంటి పన్నాగాలు పన్నాడు దాన్ని రజినీకాంత్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథ గా చెప్పుకోవచ్చు. అయితే దీనికి రజిని ఫ్లాష్ బ్యాక్ కి ఏంటి సంబంధం అనేది మైన్ ప్లాట్ . దీన్నిబట్టి చూస్తే ఈ కథ మీకు ట్రైలర్ నుంచి పక్కకు వెళ్లలేదని చెప్పాలి. ఒక చిన్న కథను తీసుకుని దానికి ఎక్కువగా స్క్రీన్ ప్లే జోడించి మురుగుదాస్ తెలివిగా ఈ సినిమాను తీసేశాడు. నయనతార క్యారెక్టర్ పెద్దగా లేకపోయినా ఆమెకి అక్కడక్కడ కొన్ని సీన్లు మాత్రమే పెట్టిన డైరెక్టర్ సెంటిమెంట్ విషయంలో మాత్రం నయనతారని బాగా ఉపయోగించుకున్నారు. ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా దర్బార్ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ ఒక మంచి కథని ఎంచుకోవడంలో మాత్రం విఫలం అయ్యాడు. నివేథ థామస్ రజినీకాంత్ కి కూతురు గా కనిపిస్తుంది. మెసేజ్ ఓరియెంటెడ్ కథ ని ఎంచుకున్న మురుగదాస్ కాస్త స్ట్రాంగ్ పాయింట్ ని తీసుకుంటే బాగుండేది అనే ఫీలింగ్ ప్రేక్షకులకి అనిపించక మానదు .

ప్లస్ పాయింట్ లు : వన్ మ్యాన్ షో తో ఈ సినిమా ని నడిపించాడు హీరో రజినీకాంత్.. తనదైన శైలి లో లుక్స్ , మ్యానరిజం ఇలా అన్నింటా తన మార్క్ చూపించడం లో రజిని ఎప్పటికీ బోర్ కొట్టడు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. డైరెక్టర్ మురుగదాస్ సెకండ్ హాఫ్ లో రాసిన కొన్ని సీన్ లు సినిమా కి అతిపెద్ద హైలైట్ అని చెప్పుకోవాలి . స్క్రీన్ ప్లే విషయం లో మురుగదాస్ మళ్ళీ మళ్ళీ తన సత్తా చాటుతూనే ఉన్నాడు. నివేథ థామస్ రోల్ ని తీర్చిదిద్దిన తీరు చాలా బాగుంది. యోగిబాబు – రజినీకాంత్ ల మధ్య కామెడీ వర్క్ ఔట్ అయ్యింది .. అనిరుథ్ నేపధ్య సంగీతం అద్దిరిపోయింది .. జిమ్ వర్క్ ఔట్ సీన్ ఫాన్స్ కి పండగే ..

మైనస్ పాయింట్ లు : ఈ సినిమా కి అతిపెద్ద మైనస్ ఈ సినిమా కథే .. ఎంతో మంచి కథలు ఎంచుకునే మురుగుదాస్ ఈ సారి చాలా పల్చటి కథని తీసుకుని విసిగించాడు. అతని పెన్ను లో ఇంక్ అయిపోయింది అన్నట్టు ఒక సాదా సీదా కథ తీసుకుని దాన్ని చాలా రొటీన్ గా చూపించాడు. ఎక్కువగా రజినీకాంత్ మార్క్ చరిష్మా మీద దృష్టి పెట్టిన మురుగదాస్ మిగితా అంశాలు పక్కకి పెట్టేశాడు అనిపిస్తుంది. నయనతార రోల్ చాలా తక్కువ నిడివి ఉండడం కూడా విసుగు తెప్పిస్తుంది… పాటల కోసమేనా హీరోయిన్ అనే ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. విలన్ గా శిల్పా శెట్టి ని చూపించడం మరొక ట్విస్ట్ అనుకున్న మురుగ అక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు. నెక్స్ట్ సీన్ ఎమోస్తుంది అనేది ప్రేక్షకుడు అత్యంత తేలికగా చెప్పేయగలిగే కథ – కథనం చాలా ఇబ్బంది పెడతాయి. క్లైమాక్స్ సరైన ముగింపు అనిపించదు . అన్నిటికంటే ఎక్కువ అసహనం క్లైమాక్స్ లోనే కలుగుతుంది.

సాంకేతిక విభాగం :: అనిరుథ్ ఈ సినిమా స్థాయి ని చక్కగా పెంచాడు అనే చెప్పాలి .. అతను ఇచ్చిన మ్యూజిల్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా కి ప్రధాన బలం. వీక్ కథ ఎంచుకున్న మురుగదాస్ తన మార్క్ స్క్రీన్ ప్లే తో పరుగులు పెట్టించే ప్రయత్నం బాగానే చేశాడు .. డబ్బింగ్ విషయం లో కాస్తంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. సినిమాటోగ్రఫీ పరావలేదు అనిపించింది.

తీర్పు :

భారీ అంచనాలతో వచ్చిన దర్బార్ ఫస్ట్ హాఫ్ చాలా ఆసక్తికరంగా సాగినా సెకండ్ హాఫ్ మాత్రం సెంటిమెంట్ , ఎమోషనల్ డ్రామాగా వెళ్లిపోతుంది. ఫస్ట్ హాఫ్ చూసి మురుగదాస్ మళ్ళీ వచ్చేశాడు కుమ్మెశాడు అనుకుంటే సెకండ్ హాఫ్ కాస్తంత నీరసం తెప్పిస్తుంది. అప్పటికీ అక్కడక్కడా కొన్ని సీన్లతో , స్క్రీన్ ప్లే తో మురుగదాస్ బాగానే లాక్కొచ్చినా క్లైమాక్స్ తో మళ్ళీ నీరుగారిపోతారు ప్రేక్షకులు .. రజినీకాంత్ ఇక మీదట మంచి స్క్రిప్త్స్ ఎంచుకుంటే మంచిది .. డైరెక్టర్ లని గుడ్డిగా నమ్ముకుని ఇబ్బంది పడడం కరక్ట్ కాదు అనే ఫీలింగ్ ప్రేక్షకుడికి వస్తుంది. అంచనావేయగలిగిన స్టోరీ లోకి అనేక మాస్ అంశాలు – రజిని చరిష్మా చొప్పించడం అనేది డైరెక్టర్ లు అర్జెంట్ గా మానుకోవాలి . అయితే కమర్షియల్ గా సంక్రాంతి సీజన్ కావడం తో తమిళనాట బాగానే కలక్షన్స్ వచ్చినా తెలుగు లో ఇంకా మూడుగు సినిమాల తాకిడి మధ్యలో తట్టుకుని నిలబడ్డం కష్టమే .. ఫామిలీ ఆడియన్స్ కి ఎక్కే అంశాలు చాలా తక్కువగా ఉండడం తో కమర్షియల్ గా తెలుగు వెర్షన్ సక్సెస్ అవ్వడం కష్టమే !!

Read more RELATED
Recommended to you

Latest news