జ‌గ‌న్ స‌ర్కార్‌ కీలక నిర్ణయం.. విశాఖకు మరో వరం..

-

విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వం.. అక్కడే మరో అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. అదే ట్రామ్ రైలు వ్యవస్థ. అమరావతిలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టు, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై సమీక్ష జరిపారు. అనకాపల్లి నుంచి భోగాపురం వరకు మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వమే ప్రతిపాదనలు తయారుచేసింది. ఇప్పుడు సీఎం జగన్ కొన్ని మార్పులు సూచించారు. విశాఖలో ట్రామ్‌ రైళ్లను తెస్తే బాగుంటుంది కదా అని ముఖ్యమంత్రి అనడంతో.. అధికారులు కూడా అవును సార్… అంటూ ఆ దిశగా ఆలోచనలకు తెరతీశారు.

ఆర్‌కే బీచ్‌ నుంచీ భీమిలి, పెందుర్తి నుంచి నాడ్‌ జంక్షన్‌, ఇలా సిటీలోని ప్రధాన ప్రాంతాల్లో ట్రామ్‌ల ఏర్పాటు వల్ల ఖర్చు చాలా తగ్గుతుందని అధికారులు సమావేశంలో తెలిపారు. ట్రామ్‌లకు సంబంధించి ప్రపంచంలో ఇప్పటికే అమలులో వున్న కొన్ని మోడళ్లను అప్పటికప్పుడే సమీక్షలో సీఎంకి చూపించడంతో సీఎం జ‌గ‌న్ ట్రామ్ రైళ్లను తెద్దామని ఫిక్స్ చేశారు. లేటెస్ట్ ప్లాన్ ప్రాకారం అనకాపల్లి నుంచి దువ్వాడ… మధురవాడ నుంచి భోగాపురం వరకూ మెట్రో రైళ్లు నడపబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news