సూపర్ స్కీమ్.. లక్షకు రెండు లక్షలు.. రూ.2 లక్షలకు రూ.4 లక్షలు..!

-

ఈరోజుల్లో విపరీతంగా మోసాలు పెరిగిపోతున్నాయి. చాలా మంది డబ్బులు నష్టపోతున్నారు. వీలైనంత వేగంగా డబ్బులు పెరగాలని చాలామంది చూస్తున్నారు. తక్కువ పెట్టుబడి మార్గాలు అవకాశాలు ఏ రిస్క్ లేకుండా డబ్బులు పొందడానికి ఉంటాయి. చాలా మంది ఆదాయాన్ని పెంచుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లతో పాటుగా ప్రభుత్వ పథకాలలో కూడా డబ్బులు పెడుతున్నారు. రిస్క్ లేకుండా డబ్బులు పెంచుకోవడానికి భారతీయ పోస్ట్ ఆఫీస్ లో ఉండే ఒక స్కీమ్ గురించి ఇప్పుడు చూద్దాం.

post office

ఈ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్యారెంటీ రాబడి కారణంగా దేశంలోని ప్రముఖ పెట్టుబడి పథకాల్లో ఒకటిగా ఇది ప్రజాదరణ పొందింది. ఇదే కిసాన్ వికాస్ పత్ర. 7.5% వడ్డీ రేటు అందిస్తోంది. ఎలాంటి రిస్క్ లేకుండా సురక్షితంగా డబ్బులు పొందవచ్చు. ఇది సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇందులో నిర్ణీత మొత్తంలో పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుత వడ్డీ రేటు 7.5% ప్రకారం 115 నెలల కాలంలో డబల్ అవుతుంది.

5 లక్షల ఇన్వెస్ట్ చేస్తే 10 లక్షలు అవుతాయి. కిసాన్ వికాస్ పత్ర స్కీం కింద ఉమ్మడి ఖాతాను కూడా తెలుసుకునే తెరిచే అవకాశం ఉంటుంది వెయ్యి కంటే తక్కువతో కూడా ప్రారంభించచ్చు. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడి మొత్తం 115 నెలల తర్వాత డబల్ అవుతుంది. మధ్యలో ఎలాంటి డబ్బు అదనంగా చెల్లించక్కర్లేదు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే రెండు లక్షలు. రెండు లక్షలు పెడితే నాలుగు లక్షలు అవుతాయి

Read more RELATED
Recommended to you

Latest news