బర్త్ డే వేడుకలకు అని పిలిచి వృద్ధురాలిపై దాడి.. బంగారం అపహరణ!

-

జన్మదిన వేడుకలకు పిలిచి ఓ వృద్ధురాలిపై దంపతులు దాడికి తెగబడ్డారు. అనంతరం ఆమె వద్ద ఉన్న బంగారాన్ని దోచుకెళ్లారు.ఈ దారుణ ఘటన శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది.పోలీసుల కథనం ప్రకారం.. మూడుచింతలపల్లి మండలం జగ్గంగూడ గ్రామానికి చెందిన చెవ్వా రాములమ్మను గత రెండు రోజుల కిందట ఆమె ఇంటి పక్కన కిరాయికి వచ్చిన ఓ జంట పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానించింది.

దీంతో సోమవారం సాయంత్రం బర్త్ డే వేడుకల కోసం పక్కింటికి వృద్ధురాలు వెళ్లింది. అనంతరం అక్కడ పార్టీలో పాల్గొన్న ఆమె మద్యం పుచ్చుకుంది. ఈ క్రమంలోనే మత్తులో రాములమ్మను ఆమె ఇంట్లో దించడానికి వెళ్లిన ఆ జంట ఆపై దాడికి పాల్పడి సుమారు 7 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలను అపహరించుకుని పరారయ్యారు. గాయాలపాలైన బాధిత వృద్ధురాలిని ఆర్‌వీఎం హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news