ములుగు మున్సిపాలిటీ బిల్లు.. గవర్నర్ వద్దకు మంత్రి సీతక్క

-

ములుగు ప్రాంతాన్ని మున్సిపాలిటీగా మార్చే బిల్లును ఆమోదించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రి సీతక్క కోరారు. మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ఆమె భేటీ అయ్యారు.ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ములుగును మున్సిపాలిటీగా మారుస్తూ 2022 గత ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టిందని ఆమోదించిందని గుర్తుచేశారు.అయితే, గత గవర్నర్ తమిళిసై చాలా కాలంగా ఈ బిల్లును పెండింగ్‌లో పెట్టారని గుర్తుచేశారు.దీనిపై ఎంక్వయిరీ చేయగా, మిగతా నాలుగైదు బిల్లులతో పాటు ములుగు మున్సిపాలిటీ బిల్లును కలిపి పంపడంతో పెడింగ్‌లో ఉంచారని, ఆ తర్వాత రాష్ట్రపతి వద్దకు పంపారని తెలిసిందన్నారు.

అందుకే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లును ఆమోదించి ములుగును మున్సిపాలిటీగా మార్చాలని గవర్నర్‌కు తాజాగా మంత్రి సీతక్క విన్నవించారు. తన విజ్ఞప్తిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు. అలాగే జైనూర్ ఘటనపై వివరాలను సైతం గవర్నర్ ఆరా తీశారని చెప్పారు. ఆదివాసీ ప్రజల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకునేందుకు త్వరలో ఆదిలాబాద్,నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించాలని గవర్నర్‌ను కోరినట్లు సీతక్క తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news