BRS ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సాపూర్ లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడారు. BRS ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారన్నారు. మాకు రెండు మంత్రి పదవులు ఇవ్వండి అందరం వచేస్తామని BRS ఎమ్మెల్యేలు అంటున్నారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/09/Sensational-comments-of-former-MLA-Mynampally-Hanumantha-Rao-in-Narsapur.jpg)
అనవసరంగా మమ్మల్ని గెలికి మిమ్మల్ని మీరే బొంద పెట్టుకోకండని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. మేము ఒక్కసారి గేట్లు తెరిస్తేనే మీరు తట్టుకోలేదు…ఇక తెరిస్తే మీ పని ఖతం అయిపోతుందని వార్నింగ్ ఇచ్చారు. రేపటి నుంచి మా టార్గెట్ బావబామ్మర్దులు కేటీఆర్, హరీష్ రావు అన్నారు. గోమారంలో జరిగి న చిన్న విషయాన్ని కావాలని రాజకీయం చేశారని నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమం తరావు.