బీఆర్‌ఎస్ దోచుకోవడం దాచుకోవడమే తప్ప ఏం చెయ్యలేదు : కొండా సురేఖ

-

హైదరాబాద్ తరువాత వరంగల్ కు అభివృద్ధి పై దృష్టిపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగింది అని మంత్రి కొండా సురేఖ తెలిపారు. విపక్ష కార్పొరేటర్లకు కూడా నిధులు అందరితో సమానంగా కౌన్సిల్లో మాట్లాడడానికి సమయం కేటాయించడం జరిగింది. నగరంలో అక్రమాలకు గురైనా ప్రభుత్వ స్థలాలను గుర్తించి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకునే విధంగా తిర్మానం చేశారు. వరంగల్ నగరంలో అన్ని చెరువులపై అభివృద్ధి దిశగా తీర్మాణం చేసాం. నయీంనగర్ నాల బ్రిడ్జి తో ముంపు ప్రాంతవాసుల కష్టాలు తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏయిర్ పోర్టు నిర్మాణానికి తీర్మాణం చేసుకున్నాం.

కాళోజీ కళా క్షేత్రం పై గత ప్రభుత్వం చిన్న చూపు చూసింది..ముఖ్యమంత్రి చొరవతో ప్రత్యేక ఫండ్స్ తీసుకొచ్చాం. వర్షా కాలంలో ప్రభలుతున్న రోగాలపై ప్రత్యేక టీం ఏర్పాటు చేసాం. విద్యా వైద్యం అభివృద్ధి సంక్షేమాల పై రేవంత్ రెడ్డి గారి ఆదేసాను సారం ముందుకెళ్తున్నాం. గత పాలకుల విమర్శలు మేము పట్టించుకోం…మా పని మేము చేసుకుంటు పోతున్నాం. లక్షలకోట్లు మింగిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాకు అప్పులకుప్పతో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టింది. ప్రతినెల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను సకాలంలో ఇస్తున్నాం. ఎక్కడ తగ్గకుండా ప్రతిచోట సంక్షేమ పథకాలను జనాలకు అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో గుట్టలు గుట్టలుగా ఉన్న సీఎం హెల్త్ రిలీప్ ఫండ్ మా ప్రభుత్వం లో క్లియర్ చేస్తున్నాం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడమే తప్ప ఏమి చేయలెదు అని మంత్రి కొండా సురేఖ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news