పాకిస్తాన్ బిచ్చగాళ్లకు సౌదీ ప్రభుత్వం గట్టి వార్నింగ్..

-

హజ్ యాత్ర పేరుతో తమ దేశానికి యాత్రికులను కాకుండా బిచ్చగాళ్లను పంపిస్తోందంటూ సౌదీ ప్రభుత్వం పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉమ్రా,హజ్ వీసాలతో పెద్ద సంఖ్యలో పౌరులు తమ దేశంలోకి ఎంట్రీ ఇస్తున్నారని, పాకిస్థాన్ వెంటనే ఈ విషయాన్ని గుర్తించి,తగిన చర్యలు తీసుకోవాలని సౌదీ హెచ్చరించింది. పాకిస్థానీ బిచ్చగాళ్లు తమ దేశంలోకి వెల్లువలా వచ్చిపడుతున్నారని, దీంతో తమ దేశంలోని పౌరులు వారి వలన ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది.

ఈ క్రమంలోనే సౌదీలో భిక్షాటన చేస్తున్న అనేకమంది పాకిస్థానీయులను స్థానిక అధికారులు పట్టుకుని వారిని తిరిగి పాకిస్థాన్‌కు పంపారు. కాగా, సౌదీ అరేబియా ప్రభుత్వం హెచ్చరికలు చేసిన విషయాన్ని పాకిస్థాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా నిర్ధారించింది.దీనిపై పాకిస్థాన్ హోంమంత్రి మొహిసిన్ నక్వీ స్పందిస్తూ పెద్ద సంఖ్యలో బిచ్చగాళ్లను సౌదీ పంపడం వెనుక ఓ మాఫియా పనిచేస్తోందని ఆరోపించారు.ఈ బెగ్గర్ మాఫియా పాకిస్థాన్ పరువును తీస్తోందని ఫైర్ అయ్యారు. దీనిపై విచారణ కోసం ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఆదేశించినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news