మీ భాగస్వామి ద్వేషిస్తోందని చెప్పే.. 6 సంకేతాలు ఇవే..!

-

ప్రతీ ఒక్కరు కూడా లైఫ్ లో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి అందమైన జీవితాన్ని పంచుకోవాలనుకుంటారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని ద్వేషిస్తుందని తెలిపే సంకేతాల గురించి ఇప్పుడు చూద్దాం… మీతో సమయం గడపకుండా ఉండడం. చాలా మంది వారికి ఉన్న సమయాన్ని గడపకుండా ఏవేవో పనులు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా చేస్తుంటే వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు. మీకు ప్రాధాన్యతను ఇవ్వక పోయినట్లయితే కూడా వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు.

అలాగే మీతో ఎలాంటి భావోద్వేగ సన్నిహిత్యాన్ని పంచుకోకపోవడం కూడా మిమ్మల్ని ద్వేషిస్తున్నారు అని చెప్పడానికి సంకేతమే. ఇవే కాకుండా మీ పార్ట్నర్ మిమ్మల్ని ద్వేషిస్తున్నట్లయితే చిన్న చిన్న విషయాలకి మిమ్మల్ని విమర్శించడం మొదలుపెడతారు. అలాగే ఎప్పుడూ కూడా మీకు దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు. మీ దగ్గరికి రావడానికి కూడా వాళ్లకు ఇష్టం ఉండదు.

ద్వేషిస్తున్నారంటే మిమ్మల్ని అవమానించే అవకాశాన్ని వదిలిపెట్టరు. వాళ్లు మీ రిలేషన్ కోసం ఎలాంటి ప్రయత్నం కూడా చేయరు. మీ మానసిక స్థితి వారి మానసిక స్థితిపై ఎటువంటి ప్రభావాన్ని చూపించదు. ఎప్పుడూ మీ పట్ల హృదయపూర్వకంగా వాళ్ళు ఉండరు. ఇలా వీటి ద్వారా మీ పార్ట్నర్ మిమ్మల్ని ద్వేషిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. పార్ట్నర్ తో కలిసి హ్యాపీగా ఉండాలంటే కచ్చితంగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి మంచి కమ్యూనికేషన్ ఉండాలి. గౌరవించుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news