ఇవాళ టీం ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండవ టెస్ట్ ప్రారంభం కానుంది. కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ వేదికగా ఈ మ్యాచ్ ఇవ్వాల్టి నుంచి జరగనుంది. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాన్పూర్ గ్రీన్ పార్క్ పూర్తిగా స్పిన్కు అనుకూలం కావడంతో ముగ్గురు స్పిన్నర్లతో రోహిత్ శర్మ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మొదటి టెస్ట్ విజయం సాధించిన టీమిండియా రెండో టెస్టులో విజయం సాధించి స్వీప్ చేయాలని అనుకుంటుంది.
భారత్: ప్రాబబుల్ ఎలెవన్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్), కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్/జస్ప్రీత్ బుమ్రా
బంగ్లాదేశ్ ప్రాబబుల్ XI: షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (c), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్ (wk), మెహిదీ హసన్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్/నహిద్ రానా, తైజుల్ ఇస్లాం