ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్.. ఫస్ట్ అభ్యర్థన స్వీకరించిన మంత్రి పొన్నం

-

తెలంగాణ ప్రభుత్వం ఈరోజు నుంచి మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రజావాణి కార్యక్రమం మాదిరిగానే ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు జరుగనుంది. ప్రతీ బుధ, శుక్రవారాల్లో నిర్వహించనున్నారు. మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ జి.చిన్నారెడ్డి ప్రారంభించారు.

గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న షేక్ హుస్సెన్ కుటుంబం నుంచి ఫస్ట్ అభ్యర్థనను మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీకరించారు. సమస్యల వినతి కోసం గల్ఫ్ కార్మికులు భారీగా పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి గల్ఫ్ కార్మికుల సమస్యలపై తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల్లో చెప్పినట్టు 4 అంశాలపై నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉపాధి నిమిత్తం చాలా మంది గల్ఫ్ వెళ్తుంటారని.. ఏదైనా గల్ఫ్ ప్రమాదంలో మరణించిన వారికి రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియా ఇచ్చేందుకు జీవో జారీ చేసినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news