ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందే : బ్రిటన్ ప్రధాని

-

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ కు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ మద్దతు తెలిపారు. తాజాగా బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ కూడా ఆ జాబితాలో నిలిచాడు. న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్  సాధారణ చర్చలో మాట్లాడారు కైర్ స్టార్మర్.  ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

సభ్య దేశాల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని.. మారుతున్న కాలానికి అనుగుణంగా భద్రతా మండలిని విస్తరించాలని, దేశాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రధానంగా బ్రెజిల్, ఇండియా, జర్మనీ, జపాన్ వంటి దేశాలు శాశ్వత సభ్యులుగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఆఫ్రికా నుంచి రెండు దేశాలకు ప్రాతినిథ్యాన్ని చూడాలనుకుంటున్నట్టు తెలిపారు. ఎన్నికైన సభ్యులకు కూడా ఎక్కువ సీట్లు ఉండాలన్నారు బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్.

Read more RELATED
Recommended to you

Latest news