హుజూరాబాద్‌లో విషాదం నింపిన డెంగ్యూ.. పదేళ్ల బాలిక మృతి!

-

రాష్ట్రంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. మందులు వాడినా ఎంతకూ తగ్గకపోవడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తోందని, టెస్టులకే వేలకు వేలు ఖర్చుచేయాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.అయితే, విషజ్వరం బారిన పడి ఓ బాలిక ప్రాణాలు విడిచింది. ఈ ఘటన హుజూరాబాద్ పట్టణంలో సోమవారం వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన రావుల వెంకటేశ్వర్లు కుమార్తె రిషితకు (10) నాలుగు రోజుల కిందట జ్వరం రావడంతో వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయినా జ్వరం ఏమాత్రం తగ్గకపోవడంతో హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. టెస్టులు చేయగా అక్కడ డెంగీ నిర్ధారణ అయ్యింది. అప్పటికే రిషిత ఆరోగ్యం విషమించింది. మెరుగైన చికిత్స అందించినప్పటికీ ప్లేట్‌లెట్స్ పూర్తిగా పడిపోయాయి. ఈ క్రమంలోనే రిషితకు హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయిందని వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news