నేటి నుండి హైదరాబాదులో డీజే పై నిషేధం..!

-

హైదరాబాదులో డీజే అండ్ ఫైర్ క్రాకర్స్ పై నిషేధం విధించారు. శబ్ద కాలుష్యం వల్ల డీజే ను నిషేధిస్తున్నట్లు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేసారు. హైదరాబాదులో డయల్ 100 కు ఫిర్యాదులు రావటంతో నగరంలోని రాజకీయ పార్టీ ప్రతినిధులు, అన్ని మత పెద్దలతో చర్చ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. డిజె, సౌండ్ మిక్సర్, హై సౌండ్ ఎక్యూప్మెంట్ పరికరాలపై నిషేధాజ్ఞలు జారీ చేసారు.

రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఈ నిషేధం ఉంటుంది. అనుమతి ఉన్న ప్రాంతాల్లో తక్కువ శబ్దంతో ఉపయోగించవచ్చు. జనావాసాల ప్రాంతంలో ఉదయం 55 డెసిబెల్స్ కి మించి సౌండ్ సిస్టం లో వాడరాదు. రాత్రి వేళలో 45 డేసి బస్సుకి నుంచి సౌండ్ సిస్టంలో వాడరాదు. ఆసుపత్రులు, స్కూళ్లు, కాలేజీలు, కోర్టు ప్రాంగణాలకు 100 మీటర్ల దూరంలో ఈ నిషేధాజ్ఞలు వర్తిస్తాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి బి. ఎన్. ఎస్ చట్ట ప్రకారం ఐదేళ్ల వరకు జైలు శిక్ష తోపాటు జరిమానా పడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news