ఆ ఇద్దరిలో ఒకరు అవుట్… విష్ణుప్రియకి డేంజర్ బెల్స్..!

-

బిగ్ బాస్ సీజన్ 8 నాలుగో వారాన్ని కంప్లీట్ చేసుకుని విజయవంతంగా 5 వారంలోకి వచ్చింది. మొత్తంగా ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. విష్ణు ప్రియ, నైనిక, మణికంఠ, ఆదిత్య, నిఖిల్ ఈ వారం ఎలిమినేషన్స్ లో ఉన్నారు. సోనియా వెళ్లిపోవడంతో యాష్మి గౌడ ఆమె ప్లేస్ ని ఆక్రమించాలని చూస్తోంది. ఆటలో మాటల్లోనూ కూడా ఆమె దూకుడు పెంచింది. తొలిసారిగా ఓ గేమ్ గెలిచేసరికి ఆమె ఎంతో సంబర పడిపోయింది. దానికే ఆమె ఎక్స్ట్రాలు మామూలుగా చేయట్లేదు.

ఛాలెంజ్లో బాల్స్ ని వేసేసరికి ఆమె సంబరాలు చేసుకుంటోంది. ఇంకో టాస్క్ లో ఓడిపోయిన నబీల్ ని ఉద్దేశించి హేళనగా మాట్లాడింది. హౌస్ లోకి 12 మంది వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఇప్పటికే బిగ్ బాస్ చెప్పారు చాలా వరకు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. టేస్టీ తేజ, గీతూ రాయల్, ముక్కు అవినాష్ వంటి వాళ్ల పేర్లు వినపడుతున్నాయి.

సోమవారం అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ చూస్తే నబిలా 26.2% ఓటింగ్ లో టాప్ లో ఉన్నాడు. నిఖిల్ 25.6% ఓటింగ్ తో గట్టి పోటీ ఇస్తున్నాడు. మణికంఠ 18.94% మూడో ప్లేస్ లో ఉన్నాడు. విష్ణు ప్రియ 14.51% ఓటింగ్ తో వెనుకబడిపోయింది. ఆదిత్య, నైనిక తక్కువ ఓట్లతో డేంజర్ లో ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి వీళ్లల్లో ఒకరు వెళ్లిపోవచ్చని తెలుస్తోంది. మరి ఏమవుతుంది అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news